
జమ్మికుంట, మే 20 (zindagi9news) : హిందూ ఐక్యతను బలోపేతం చేసేందుకు కరీంనగర్లో ఈ నెల 22న (గురువారం) నిర్వహించనున్న హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేయాలని ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ పిలుపునిచ్చారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ యాత్రలో కేరళ కళాబృందాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నాయని తెలిపారు. జమ్మికుంట, ఇల్లంతకుంట మండలాల నుంచి కార్యకర్తలు, హిందూ బంధువులు పెద్దఎత్తున పాల్గొని యాత్రను ఘనవంతం చేయాలని, జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు, మండల అధ్యక్షుడు సంపెల్లి సంపత్ రావు, ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి సూచించారు.
