జమ్మికుంట సెక్టర్లో ‘అమ్మ మాట – అంగన్వాడి బాట’ కార్యక్రమం

జమ్మికుంట: గణేష్ నగర్ అంగన్వాడి పరిధిలో మంగళవారం ‘అమ్మ మాట – అంగన్వాడి బాట’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రెండున్నర నుండి మూడు సంవత్సరాల వయస్సు గల చిన్నారులను అంగన్వాడి కేంద్రాల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యం.

ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రాల్లో అందించే పూర్వ ప్రాథమిక విద్యా విధానాల గురించి, చిన్నారులకు అందే పోషకాహార ప్రయోజనాల గురించి తల్లిదండ్రులకు వివరించారు.
కార్యక్రమంలో సూపర్వైజర్ శిరీష, అంగన్వాడీ టీచర్ స్వరూప, హెల్పర్ దేవి, ప్రదం కోఆర్డినేటర్ నితీష్ పాల్గొన్నారు. ప్రీస్కూల్ పిల్లలు, తల్లిదండ్రులు పెద్దఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
