భూపాలపల్లి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా షురూ
నిర్దేశించిన ధరలకే మూడు రీచ్ల నుంచి ఇసుక విక్రయాలు – జిల్లా యంత్రాంగం స్పష్టం

భూపాలపల్లి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్న జిల్లా యంత్రాంగం, మూడు ఇసుక రీచ్లకు అనుమతులు మంజూరు చేసింది. టేకుమట్ల, కాల్వపల్లి, మొగుళ్ళపల్లి రీచ్ల నుంచి మాత్రమే ఇసుకను తరలించేందుకు వీలు ఉండనుంది.
ఈ సందర్భంగా అధికారులుః
“ప్రభుత్వానికి ఎలాంటి సుంకం చెల్లించకుండా, ఇసుక ట్రాక్టర్ యజమానులు నేరుగా ప్రజలకు సరఫరా చేయాలి. ఇందిరమ్మ గృహాల కోసం జిల్లా కలెక్టర్ నిర్దేశించిన ధరలకే ఇది జరగాలి,” అని స్పష్టం చేశారు.
ఇసుక రవాణా గడువు:
- ప్రతి రోజు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే.
- ప్రభుత్వ సెలవు దినాల్లో రవాణా నిషేధం.
ఇసుక ధరలు (ఒక ట్రాక్టర్కు):
గోరుకోత్తపల్లి: రూ. 3,500/-
రేగొండ: రూ. 3,000/-
చిట్యాల: రూ. 1,700/-
భూపాలపల్లి: రూ. 3,000/-
ఘనపూర్: రూ. 3,000/-
టేకుమట్ల: రూ. 1,500/-
మొగుళ్ళపల్లి: రూ. 1,500/-
శాయంపేట: రూ. 4,000/-
ఈ ధరలను అతిక్రమించే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అధికారుల హెచ్చరిక. ప్రజలు ఈ అవకాశాన్ని పూర్తిగా ఉచితంగా వినియోగించుకోవచ్చని తెలిపారు.
ట్రాక్టర్ యజమానులకు నిబంధనలు:
- వాహనానికి నంబర్ ప్లేట్, అవసరమైన పత్రాలు తప్పనిసరిగా ఉండాలి.
- అనుమతినీటి ప్రదేశం నుండి వేరే ప్రాంతానికి తరలిస్తే వాహనాన్ని సీజ్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేయబడుతుంది.
- లోడింగ్ పాయింట్ వద్ద రెవెన్యూ అధికారులు, పోలీసుల నిఘా ఉంటుంది.
వేరే ప్రాంతాల నుంచి ఇసుక తేస్తే:
- మొదటి దఫా: రూ. 25,000 జరిమానా
- రెండవ దఫా: రూ. 50,000 జరిమానా
- మూడో దఫా: కోర్టులో డిపాజిట్ చేసి చర్యలు
ఇంకా, నియోజకవర్గం గడులు దాటి ఇసుక తరలిస్తే కూడా క్రిమినల్ కేసు నమోదవుతుందని అధికారుల హెచ్చరిక.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
