రెండో విడత GPO పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్, జులై 10: తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రామ పాలన అధికారుల (Grama Palana Officers – GPO) పోస్టుల భర్తీకి రెండో విడతగా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రెవెన్యూ శాఖ ఉత్తర్వుల ప్రకారం, ముఖ్య భూసేవల కమిషనర్ కార్యాలయం నుంచి జారీ చేసిన తాజా నోటిఫికేషన్ (Ref. No. Ser.V(1)/3048466/25, తేదీ: 08.07.2025) ద్వారా ఈ ప్రక్రియ ప్రారంభమైంది.
ఇందులో భాగంగా, రాష్ట్రంలోని మాజీ వీఆర్వోలు (Ex-VROs) మరియు వీఆర్ఏలు (Ex-VRAs) తమ ఎంపికను ప్రకటిస్తూ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇందుకోసం ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తు చేయాలి:
https://forms.gle/rBDToMSakRcPoivWA
దరఖాస్తు చేసిన అనంతరం, సంతకం చేసిన పత్రాన్ని సంబంధిత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్వయంగా సమర్పించాల్సి ఉంటుంది.
చివరి తేదీ: దరఖాస్తుల స్వీకరణకు జూలై 16, 2025 చివరి తేదీగా పేర్కొన్నారు.
నియామక ప్రక్రియ, విధుల వివరాలు, నిబంధనల పూర్తి సమాచారం అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు:
https://ccla.telangana.gov.in
