ప్రపంచ జనాభా దినోత్సవం అవగాహనా ర్యాలీ

జమ్మికుంట,జూలై 11 (zindagi9news ): ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జమ్మికుంట పట్టణంలో వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో అవగాహనా ర్యాలీ నిర్వహించారు.
వైద్యాధికారి డాక్టర్ చందన, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి సమన్వయంతో, ఆరోగ్య ఉపకేంద్రాల సిబ్బంది పురవీధుల్లో
“ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు”, “పరిమిత కుటుంబం–అపరిమిత ఆనందం” వంటి నినాదాలతో ప్రజల్లో చైతన్యం కల్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రపంచ జనాభా దినోత్సవం లక్ష్యం—అధిక జనాభా వల్ల ఏర్పడే కుటుంబ, ఆరోగ్య, పర్యావరణ సమస్యలపై అవగాహన కల్పించడమే అని వివరించారు.
జనాభా నియంత్రణ, మహిళా సాధికారత, బాల్య వివాహాల నివారణ, లింగ సమానత్వం, మాతృ ఆరోగ్యం తదితర అంశాల్లో ప్రజలకు విద్య అందించాలనే ఉద్దేశంతో
ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు రత్నకుమారి, అరుణ, కుసుమకుమారి, నర్సింగ్ ఆఫీసర్ సాయికుమార్,
సిబ్బంది నరేందర్, సరళ, మంజుల, సాజిదా పర్వీన్, సావిత్రి, రజిత, సంధ్యవాణి, రాధా మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
సరైన సమయంలో గర్భధారణ, గర్భాల మధ్య అంతరముతో తల్లి-శిశువు ఆరోగ్యానికి రక్షణ!
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
