జమ్మికుంట: హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో జమ్మికుంట శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నూతన తెలుగు సంవత్సర క్యాలెండర్ను వేద పండితుల ఉద్ఘాతనతో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పురోహితులు డింగరి హరికృష్ణమాచార్యులు, కపర్తి శర్మ, డింగరి రవికుమార్ తదితరులు మాట్లాడుతూ, హిందూ ధర్మ సంరక్షణలో భాగంగా తెలుగు మాసాల ప్రాధాన్యతను వివరించారు.
కార్యక్రమంలో ప్రముఖులు ఆకుల రాజయ్య, బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, పంచముఖ దేవస్థానం చైర్మన్ మల్లయ్య, సుదర్శన్ సహా పలువురు పాల్గొన్నారు.
హిందూ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణే తమ లక్ష్యమని నిర్వాహకులు వెల్లడించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
