మల్లాపూర్ (సంగారెడ్డి): కుటుంబ విభేదాలతో మనస్తాపానికి గురైన ఓ తండ్రి తన ఇద్దరు చిన్నారులను హత్య చేసి అనంతరం తానే ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని మల్లాపూర్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది.
స్థానికంగా ఉన్న సుభాష్ (42) అనే వ్యక్తికి తన భార్యతో కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో భార్య అతన్ని వదిలి వెళ్లిపోయింది. దీనితో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన సుభాష్, తన ఇద్దరు పిల్లలు మారిన్ (13) మరియు ఆరాధ్య (10)లను ఉరివేసి హత్య చేశాడు. అనంతరం తానూ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ దుర్ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మల్లాపూర్ గ్రామంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
