
సేవాజీవి రత్నకుమారి రిటైర్మెంట్ కార్యక్రమం ఘనంగా
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ సూపర్వైజర్గా సేవలందిస్తున్న రత్నకుమారి నేడు (31-08-2025) పదవీ విరమణ చేశారు.
1991 మార్చి 22న ఖమ్మం జిల్లా వేంసూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం S/C తుమ్మూరులో ఉద్యోగ జీవితం ఆరంభించిన రత్నకుమారి, తన 34 ఏళ్ల సేవలో అనేక ప్రాంతాల్లో ప్రజలకు అహర్నిశలు ఆరోగ్యసేవలు అందించారు. సింగభూపాలెం, ఎర్రగుంట, రామారం, జూలపల్లి, మంగపేట ప్రాంతాల్లో సేవలందించి, ప్రజలలో విశ్వాసం నింపిన ఆమె 2020లో కరోనా మహమ్మారిని ఎదుర్కొని వందలాది మంది రోగులకు తల్లిలా ఆదరణ అందించారు.
జీవనమంతా “సుఖం కన్నా బహుజనహితం మిన్న” అనే ధ్యేయంతో పనిచేసిన రత్నకుమారి సేవలు అనన్యసామాన్యమని సహచరులు కొనియాడారు.
ఈ సందర్భంగా నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకట రమణ, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ చందు, పిఓ ఎంసిహెచ్ సనా జవేరియా, వైద్యాధికారులు డాక్టర్ వరుణ, డాక్టర్ తులసీదాస్, ఎంఎల్హెచ్పి డాక్టర్స్, హెల్త్ ఎడ్యుకేటర్స్ పంజాల ప్రతాప్ గౌడ్, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొని ఆమె సేవలను కొనియాడారు.
