
ముద్ర లోన్ పేరుతో యువకుడికి సైబర్ మోసం
జమ్మికుంట, ఆగస్టు 29 : కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం అంకుషాపూర్ గ్రామానికి చెందిన కడిపికొండ శివరెడ్డి సైబర్ మోసగాళ్లకు బలయ్యాడు. ముద్ర లోన్ మంజూరైందంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి వాట్సాప్ ద్వారా లింక్ పంపించాడు. లోన్ కోసం డబ్బులు జమ చేయాలని నమ్మబలికి అతని వద్ద నుండి రూ.1.50 లక్షలు తీసుకున్నారు. కానీ తర్వాత ఎటువంటి లోన్ ఇవ్వకపోవడంతో తాను మోసపోయినట్టు శివరెడ్డి గుర్తించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
🗳️ Zindagi9News ప్రజాభిప్రాయం
హైదరాబాద్లో భారీ AI పెట్టుబడులు.. ఏ రంగానికి ఎక్కువ ప్రయోజనం? మీ ఓటు వేయండి
ఉద్యోగాలు0%
టెక్నాలజీ అభివృద్ధి0%
స్థానిక వ్యాపారాలు0%
విద్యా - నైపుణ్య అవకాశాలు0%
మొత్తం ఓట్లు: 0
🛍️ Z9 SHOPPING
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
