హైదరాబాద్: సింగరేణి సంస్థ చరిత్రలో మరో మైలురాయిని చేరుకుంది. దాదాపు 130 ఏళ్లుగా బొగ్గు తవ్వకాల్లో అనుభవం కలిగిన ఈ సంస్థ తొలిసారి తెలంగాణ రాష్ట్రం వెలుపల తవ్వకాలను ప్రారంభించింది. ఒడిశాలోని అంగుల్ జిల్లాలో ఉన్న నైనీ బొగ్గు బ్లాకులో తవ్వకాలు ప్రారంభించడాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభినందించారు.
“ఇది అభినందనీయమైన సంఘటన. తెలంగాణ సింగరేణి సంస్థ రాష్ట్రానికి వెలుగులు పంచే విధంగా పనిచేసి, భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేస్తోంది,” అని ముఖ్యమంత్రి అన్నారు. సింగరేణి సంస్థకు ఒడిశాలో కేటాయించిన బొగ్గు గనులకు అన్ని అనుమతులు పొందడం, తవ్వకాలు ప్రారంభించడం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సంస్థ ఉద్యోగులు, అధికారులను అభినందించారు.
