భూపాలపట్నం, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాల మేరకు, సమాచార & పౌర సంబంధాల శాఖ అధికారి లక్ష్మణ్ కుమార్ సూచనతో తెలంగాణ సాంస్కృతిక సారథి శ్రీకాంత్ చారి బృందం భూపాలపట్నం గ్రామంలో కళాజాత నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణ, వ్యక్తిగత శుభ్రత వంటి అంశాలపై కళాకారులు పాటల ద్వారా గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.
కళాజాతలో గొల్లపల్లి శ్రీకాంత్, ఓల్లాల వాణి, దుర్గం మురళి, ఎర్రవెల్లి శంకర్, కైరీ తిరుపతి, పుల్ల శ్రావన్, మిట్ట సౌమ్య, పంతంగి అర్చన, చిలుమల రాధా, గసికంటి సంధ్య, కంసాని ఉదయ పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
