హనుమకొండ జిల్లా, మార్చి 04,(జిందగీ9 న్యూస్ ప్రతినిధి ) :

మంగళవారం హనుమకొండ జిల్లా ప్రశాంత్ నగర్ లోని సహృదయ వృద్ధాశ్రమం నందు వృద్ధులతో కలిసి పుట్టినరోజు వేడుకలను వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు ఘనంగా నిర్వహించారు.అనంతరం స్వయంగా వృద్ధులకు అన్నం వడ్డించి పండ్లు పంపిణీ చేసి వృద్ధాప్యంలో ఉన్న వృద్ధుల మధ్యలో పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం తన యొక్క తల్లిదండ్రుల మధ్యలో చేసుకున్నట్లు ఆనందం వ్యక్తపరిచారు .తన తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ప్రతి సంవత్సరం వారి మధ్యలో పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం ఎలాగైతే అనిపించిందో ఈరోజు వారు లేని లోటును ఈ వృద్ధాశ్రమం లో పుట్టినరోజు చేసుకోవడం నా తల్లిదండ్రులు ఉనట్లుగా వారి మధ్యలో చేసుకున్నట్లు అనుభూతి ఏర్పడినట్లు సంతోషం వ్యక్తం చేస్తూ తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని నిర్వాహకులకు తెలియజేశారు.అనంతరం వృద్ధాశ్రమంలో పెళ్లిరోజు వేడుకలు జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో ఎమ్మెల్యే నాగరాజు సత్కరించారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
