హనుమకొండ, మార్చి 04 (Zindagi9News ప్రతినిధి):
నేర పరిశోధనలో పోలీస్ జాగిలాలు కీలక భూమిక పోషిస్తున్నాయని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. మంగళవారం, వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు కొత్తగా చేరిన పోలీస్ జాగిలాలను ఆయన పరిశీలించారు.
గత నెల 28న మొయినాబాద్‌లోని పోలీస్ జాగిలాల శిక్షణా కేంద్రంలో ఎనిమిది నెలల ప్రత్యేక శిక్షణను పూర్తి చేసుకున్న ఐదు పోలీస్ జాగిలాలు, వరంగల్ పోలీస్ డాగ్ స్వ్కాడ్‌లో చేరి విధులు ప్రారంభించాయి. వీటిలో మూడు బెల్జియన్ మాలినోస్, రెండు గోల్డెన్ రీట్రీవర్ జాతులకు చెందినవి. వాటికి రానా, జానీ, డయానా, మాక్స్, కైరో అనే పేర్లు పెట్టారు.
జాగిలాల విశేషాలు:
✅ ప్రేలుడు పదార్థాలను పసిగట్టే ప్రత్యేక నైపుణ్యం
✅ నేర పరిశోధనలో సహాయపడే శిక్షణ
✅ అధునాతన డాగ్ స్వ్కాడ్‌లో భాగస్వామ్యం
ఈ సందర్భంగా, పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, “గతంలో మా పోలీస్ జాగిలాలు అనేక నేరాలను ఛేదించడంలో కీలక పాత్ర పోషించాయి. కొత్తగా చేరిన జాగిలాలకు మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి” అని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ సురేష్ కుమార్, ఆర్.ఐ శ్రీనివాస్, డాగ్ స్వ్కాడ్ ఇంచార్జ్ హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్, హ్యాండ్లర్లు రాజేష్ కుమార్, వెంకన్య, సురేష్, దిలీప్ పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
