భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు బీసీసీఐ సీకే నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందించనుంది. ముంబైలోని బోర్డు ప్రధాన కార్యాలయంలో రేపు జరిగే వార్షిక కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్ కు ఆ పురస్కారాన్ని ప్రదానం చేయనుంది. భారత్ తరఫున ఆయన 664 మ్యాచులాడారు. క్రికెట్ చరిత్రలోనే అత్యధిక టెస్టు, వన్డే పరుగులు చేశారు. మాజీ ఆటగాళ్లు రవి శాస్త్రి, ఫరూఖ్ ఇంజినీరు 2023లో ఈ పురస్కారం లభించింది.
