మొగుళ్ళపల్లి జనవరి 30:జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో గురువారం రోజున లక్షల డబ్బులు వేల గొంతులు చలో బహిరంగ సభను విజయవంతం చేయడానికి కోసం
మాదిగల భారీ సంస్కృతిక ప్రదర్శన పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు పుల్ల శ్రీనివాస్ మాదిగ హాజరై ఫిబ్రవరి 7న జరగబోయే భారీ ప్రదర్శన పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం పుల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఎస్సీ,ఏ బి సి డి వర్గీకరణకై మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల శాంతియుత పోరాటంలో విజయం సాధిస్తాడని దానికి మొగుళ్ళపల్లి మండల మాదిగ దండోరా మాదిగ జాతి బిడ్డలు ప్రతి ఊరు నుంచి ప్రతి ఇంటి నుండి డప్పు చేత పట్టుకొని ఫిబ్రవరి 7 తారీఖున హైదరాబాద్ రావలసిందిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు .ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మండల నాయకులు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
