ములకలపల్లి, ఫిబ్రవరి 14: సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా, ఆయన జీవిత చరిత్రను విద్యార్థులకు పరిచయం చేయడం, విజ్ఞానం పెంపొందించే లక్ష్యంతో ములకలపల్లి మండలం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూసుగూడెం లో సేవాలాల్ ఉద్యోగసేన రాష్ట్ర కన్వీనర్, TSTTF జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూక్యా బాబులాల్ నాయక్ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ నిర్వహించారు.
ఈ పరీక్షలో పదవ తరగతి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనగా, మొదటి బహుమతి డి. ఉదయ చంద్రిక, రెండవ బహుమతి బి. బాలాజీ గెలుచుకున్నారు. బహుమతులను ప్రదానం చేయడమే కాకుండా, విద్యార్థులకు సేవాలాల్ మహారాజ్ యొక్క గొప్పతనాన్ని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ హెచ్ఎం శ్రీదేవి, సీనియర్ ఉపాధ్యాయులు సత్యనారాయణ, బిచ్చగారు, ఉపాధ్యాయులు ఆదిలక్ష్మి, రమేష్, పి.డి. సురేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రశంసనీయంగా పరీక్షలో తమ ప్రతిభను కనబరచారని, ఇలాంటి కార్యక్రమాలు వారికి ప్రేరణగా ఉంటాయని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు.
