డోన్ మండల పరిధిలోని చింతలపేట గ్రామానికి చెందిన లారీ క్లీనర్ తెలుగు శ్రీను (49) అనారోగ్యంతో మృతి చెందాడు.ఆయన మృతికి డోన్ మోటార్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి టి.శివరాం సంతాపం వ్యక్తం చేశారు.గురువారం చింతలపేట గ్రామంలోని మృతుని స్వగృహంలో ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.కుటుంబ సభ్యులను పరామర్శించారు.మృతునికి భార్య,ఇరువురు కుమారులు సంతానం.అనంతరం శివరాం మాట్లాడుతూ మృతుడు చిగురమాన్ పేటకు చెందిన మౌల లారీకి క్లీనర్ గా డ్యూటీకి పోయిన క్రమంలో బుధవారం కర్ణాటక రాష్ట్రం బంగారు పేటలో అన్లోడు కోసం ఆగిన సందర్భంగా ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు గురై రక్తపు వాంతులు చేసుకొని మృతి చెందినట్లు ఆయన తెలిపారు.కార్యక్రమంలో యూనియన్ కమిటీ సభ్యుడు చింతలపేటకు చెందిన సి.గోపాల్,గోపాల్ రెడ్డి,తిరుపాలు,దస్తగిరి,వెంకటేశు,
బాలకృష్ణ,రామదాసు,రామయ్య,అంజి తదితర లారీ డ్రైవర్లు,ఆటో డ్రైవర్లు అంత్యక్రియలలో పాల్గొని నివాళులు అర్పించారు.
