రాజమండ్రిలో తొలి కరోనా కేసు.. ఏపీలో మొత్తం 16 కేసులు నమోదు
21 ఏళ్ల యువకుడికి కోవిడ్ పాజిటివ్.. రాష్ట్రంలో నలుగురు మృతి

అమరావతి, జూలై 18 (Zindagi9News): ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదైంది. 21 ఏళ్ల యువకుడికి కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో రాజమండ్రి జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 16 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఐదుగురు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, నలుగురు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. మరో ముగ్గురు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో కోవిడ్ కారణంగా నలుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్యులను సంప్రదించాలని, అవసరమైన జాగ్రత్తలు పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది.
