
హైదరాబాద్ అంబర్‌పేటలోని గోల్నాక, నెహ్రూ నగర్ పరిధి, వార్డ్ నంబర్–2లో గల హైదరాబాద్ మున్సిపల్ నార్త్ డివిజన్ కార్యాలయంలో మహిళా సహాయక ఇంజనీరు టి.మనీషా లంచం తీసుకుంటూ పట్టుబడింది.
ఫిర్యాదుదారునికి సంబంధించిన బిల్లులను ప్రాసెస్ చేసి పై అధికారులకు పంపించేందుకు ఆమె ఇప్పటికే రూ.5,000/- తీసుకుంది. తాజాగా మరో రూ.15,000/- లంచం తీసుకుంటున్న సందర్భంలో అనిశా అధికారులు ఆమెను అడ్డగించారు.
ప్రజల సేవ చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగి, విధులను నిర్వర్తించేందుకు లంచం డిమాండ్ చేసిన ఘటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలను అనిశా అధికారులు త్వరలో వెల్లడించనున్నారు.
