
హైదరాబాద్, జూన్ 24 (జిందగీ9న్యూస్):
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం పరిధిలో ఆధునిక గోశాల నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అభ్యర్థించాడు. వేములవాడ సమీపంలోని మరిపెల్లి గ్రామంలో 40 ఎకరాల స్థలాన్ని గోశాల నిర్మాణానికి అనుకూలంగా గుర్తించిన విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాడు.
ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని ప్రభుత్వ విప్ కలిశాడు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
వేములవాడ దేవస్థానానికి విచ్చేసే భక్తులకు పాలు, పంచామృతం, గోధ్రవ్యం వంటి అవసరాల కోసం గోశాల ఎంతో ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గోవుల సంరక్షణ, పునరుత్పత్తి, అవశేషాల వినియోగం వంటి కార్యక్రమాలకూ ఇది దోహదపడనుంది.
