మహబూబాబాద్ జిల్లా సర్కిల్ లో అరెస్టు చేసిన అనిశా అధికారులు

మహబూబాబాద్: కురవి మరియు మరిపెడ సబ్-డివిజన్లకు సంబంధించిన అంగీకార పత్రాల ఒప్పందాలను అలాగే కొనసాగించేందుకు అధికారికంగా సహాయం చేస్తానని చెప్పి, ఒక ఫిర్యాదుదారుని నుండి రూ.1,00,000/- లంచం డిమాండ్ చేసిన TG NPDCL ఆపరేషన్స్ విభాగానికి చెందిన సూపరింటెండింగ్ ఇంజనీర్ జనగాం నరేష్ అనిశా అధికారులకు పట్టుబడ్డారు.
ఈ డిమాండ్లో భాగంగా ఇప్పటికే రూ.20,000/- తీసుకున్న నరేష్, మిగిలిన రూ.80,000/- తీసుకుంటున్న సమయంలో అనిశా అధికారులు అతడిని పక్కా ఆధారాలతో పట్టుకున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా సర్కిల్ లో చోటుచేసుకుంది.
ఈ చర్యపై విద్యుత్ శాఖలో సంచలనం రేగింది. అవినీతి నిరోధక శాఖ (అనిశా) మరింత విచారణ జరుపుతోంది. అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
