ప్రవాసీ మిత్ర సంస్థ రూపొందించిన “రేవంత్ సర్కారు – గల్ఫ్ భరోసా” డాక్యుమెంటరీని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. గల్ఫ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తూ ప్రభుత్వం వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీని రూపొందించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్, ప్రవాసీ మిత్ర ప్రతినిధులు మంద భీమ్ రెడ్డి, పి. సునీల్ కుమార్ రెడ్డి, చెన్నమనేని శ్రీనివాసరావు తో పాటు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
