హుజురాబాద్: ఎల్ఎండి కాలనీలోని మిషన్ భగీరథ ప్రధాన పంపుహౌస్ లో మరమ్మత్తు పనులు జరుపనున్నట్లు అధికారులు తెలిపారు. 33/11 కేవీ సబ్స్టేషన్ మరమ్మత్తు పనుల కారణంగా మానకొండూర్, హుజురాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాలకు నీటి సరఫరాలో అంతరాయం కలుగనుంది.
ఈ మరమ్మత్తులు ఫిబ్రవరి 6 (గురువారం) ఉదయం 10 గంటల నుండి ఫిబ్రవరి 7 (శుక్రవారం) సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నాయి. ఈ రెండు రోజుల పాటు ఆయా ప్రాంతాల ప్రజలు స్థానికంగా నీటి వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
హుజురాబాద్ మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జె. రామ్ కుమార్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలందరూ సహకరించాలని, మరమ్మత్తు పనులు పూర్తయిన వెంటనే నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని తెలిపారు.
ప్రజలు ముందస్తుగా నీటి నిల్వలు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
