రేవంత్ నాయకత్వంలో రాష్ట్ర అన్ని రంగాల్లోఅభివృద్ధి
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో యువజన కాంగ్రెస్ కు మంచి భవిష్యత్తు ఉంటుందని ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ కు గెలుపు అని కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.. బుధవారం కరీంనగర్ పట్టణంలోని EN గార్డెన్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన ఆత్మీయ సమ్మేళనం జరిగింది.
ఈ యువజన రాష్ట్ర అధ్యక్షులు శివ చరణ్ రెడ్డి, పట్టబద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు.. ఈ సందర్బంగా మాట్లాడుతూ రానున్న రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడడమే లక్ష్యంగా యువత కష్ట పడి పని చేయాలనీ పిలుపునిచ్చారు… తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అద్భుతంగా ముందుకు వెళ్తుందని అన్నారు.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యత ఉంటుందని.. కరీంనగర్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయడం శుభపరణీయమని పేర్కొన్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు… అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం 55 వేల ఉద్యోగాలు ఇచ్చిందని గుర్తు చేశారు… నాలుగు నెలల ఎమ్మెల్సీ పర్యటనలో చాలా సమస్యలు తమ దృష్టికి వచ్చాయని.. వాటన్నిటిని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే బాధ్యత తనపై ఉందని గుర్తు చేశారు.. లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తుందని గుర్తు చేశారు.. తాను రాజకీయాలు చేయడానికి ఎమ్మెల్సీగా పోటీ చేయడం లేదని కేవలం నిరుద్యోగ యువతకు అండగా ఉండేందుకే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు వెల్లడించారు..
రాష్ట్ర అధ్యక్షుడు జక్కడి శివ చరణ్ రెడ్డి మాట్లాడుతూ అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కి కాంగ్రెస్ టికెట్ ప్రకటించగానే ఆయన గెలుపు ఖాయమైందని.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి నరేందర్ రెడ్డి కి అత్యధిక మెజార్టీ ఇస్తామని వెల్లడించారు.. రానున్న 20 రోజుల్లో ప్రతి యువజన కార్యకర్త ఒక్కొకరు 200 ఓట్లు వేయించాలని పిలుపునిచ్చారు.. పట్టభద్రుల ఎమ్మెల్సీ గెలుపులో యువజన కాంగ్రెస్ పాత్ర ఉంటుందని పునరుద్ఘాటించారు.. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో పాడాల రాహుల్,అవినాష్ గౌడ్, వెంకటేష్, ముత్యం శంకర్,ఫహద్ బీరం రాజేష్ గుర్రం వాసు, మునిగంటి అనిల్, , బండి కిషన్ రెడ్డి, ఆంక్ష రెడ్డి, వినూత్న రెడ్డి ,జెరిపోతుల వాసు,తదితరులు పాల్గొన్నారు..

Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
