గుండారం, మార్చి 8 (Zindagi9News):
సిద్దిపేట జిల్లా గుండారం గ్రామంలోని రైతులు నీటి ఎద్దడితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. బావిలు, బోర్లు ఎండిపోవడం వల్ల పంట పొలాలు వాడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకుడు సాన వేణు ప్రభుత్వాన్ని, స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను వెంటనే స్పందించాల్సిందిగా డిమాండ్ చేశారు.
అన్నపూర్ణ రిజర్వాయర్ & రంగనాయక సాగర్ నీరు ఎందుకు అందడం లేదు?
గుండారం గ్రామానికి సమీపంలోనే అన్నపూర్ణ రిజర్వాయర్ & రంగనాయక సాగర్ ప్రాజెక్టులు ఉన్నా, మా పొలాలకు నీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. “సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు వారి నియోజకవర్గ రైతులకు నీటిని విడుదల చేయిస్తుంటే, మా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మా పంటల గురించి ఎందుకు ఆలోచించడం లేదు?” అని సాన వేణు ప్రశ్నించారు.
LSM 5 కాలువ ద్వారా నీరు ఇవ్వాలి
రంగనాయక సాగర్ ప్రాజెక్టు నుండి LSM 5 కాలువ ద్వారా చౌడారం గ్రామ రైతులకు నీరు అందుతోంది. అక్కడి నుండి మా గ్రామానికి రావడంలో కొన్ని అడ్డంకులు ఉన్నాయని, వాటిని తొలగిస్తే చెక్ డ్యామ్‌లలో నీరు నిలిచి భూగర్భ జలాలు పెరిగి పంటలకు మేలు జరుగుతుందని రైతులు కోరుతున్నారు.
రైతుల డిమాండ్:
• మా గ్రామానికి అదనపు పైప్‌లైన్ ఏర్పాటు చేయాలి
• అధికారులతో మాట్లాడి చెక్ డ్యామ్‌లలో నీరు చేరేలా చూడాలి
• మంత్రులతో చర్చించి వెంటనే నీటిని విడుదల చేయించాలి
ఈ సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని గ్రామ రైతులు, బీజేపీ నాయకుడు సాన వేణు డిమాండ్ చేశారు. రైతులు ఎల్కంటి శ్రీనివాస్ రెడ్డి, సూరం తిరుపతి, మరుపాక రమేష్, ఎలుక శ్రీశైలం, గాండ్ల బాలయ్య, గైనీ నర్సయ్య, వాసంపల్లి బాల్ రెడ్డి తదితరులు ఈ నిరసనలో పాల్గొన్నారు.
— Zindagi9News 📰
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
