జమ్మికుంట, మార్చి 8 (Zindagi9News):
జమ్మికుంట మండలంలోని వావిలాల-తనుగుల మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోరపల్లికి చెందిన శ్రీకాంత్ తన కుటుంబ సభ్యులతో ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తుండగా ఓ కారు ఢీకొట్టింది.
డాక్టర్ చందన సమయస్ఫూర్తితో స్పందన
ఘటనాస్థలిలోనే ఉన్న వావిలాల డాక్టర్ మొలుగు చందన క్షతగాత్రులకు తక్షణమే ప్రథమ చికిత్స అందించి మానవత్వం చాటారు. అనంతరం 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.
ప్రయాణికుల ప్రశంసలు
ఈ ఘటనలో డాక్టర్ చందన సమయస్ఫూర్తి, సేవాభావానికి ప్రయాణికులు అభినందనలు వ్యక్తం చేశారు. “వైద్య వృత్తి తనకు తృప్తినిస్తుంది” అని డాక్టర్ చందన పేర్కొన్నారు.
— Zindagi9News 📰
