బోయినిపల్లి, ఫిబ్రవరి 21 : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని నందికమాన్ చౌరస్తా వద్ద వేములవాడ అర్బన్ మండల అధ్యక్షుడు బుర్ర శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ భారతీయ జనతా పార్టీ బలపర్చిన అభ్యర్థులు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మరియు టీచర్స్ ఎమ్మెల్సీ కొమురయ్యకు ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రచారం చేశారు.
ఈ ప్రచారంలో నాయకులు లింగపల్లి శంకర్, గోనె భాస్కర్, ఎరుగోక్కుల రమేష్, గుండెకర్ల లక్ష్మణ్, చంద్రగిరి ప్రశాంత్, నర్సింగోజు శంకర్, చల్ల నర్సయ్య, చింతకుంట నర్సయ్య, గంట మహేష్, పోచంపల్లి భాను, సంజీవ్ రెడ్డి, జింక శేఖర్, ముడికే శ్రీనివాస్,ప్రశాంత్ యాదవ్,చొక్కాల ప్రశాంత్, దామోదర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
