మంథని: మంథని మండలంలోని బట్టుపల్లి గ్రామం నుంచి 20 మంది ఆటోలో రైతు కూలీ పనికి వెళ్తుండగా నాగేపల్లి స్టేజ్ వద్ద ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటన గురించి గ్రామస్తులు మంత్రి శ్రీధర్ బాబుకు తెలియజేయగా, వెంటనే స్పందించిన మంత్రి మంథని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ తో మాట్లాడి గాయపడినవారిని ఆసుపత్రిలో చేర్పించారు. అలాగే, మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.
ఆసుపత్రులకు రిఫర్ చేసిన బాధితులు:
తీవ్ర గాయాలపాలైన కొందరిని గోదావరిఖని మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ హిమబిందు తో మాట్లాడి అక్కడికి తరలించారు.
అత్యవసర చికిత్స అవసరమైనవారిని ఎంజీఎం & నిమ్స్ ఆసుపత్రులకు తరలించేందుకు ACP రమేష్ ఆధ్వర్యంలో చర్యలు తీసుకున్నారు.
కండెల ఎర్రక్క అనే మహిళను మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ అపోలో హాస్పిటల్ కు తరలించారు.
మంత్రి శ్రీధర్ బాబు ఆసుపత్రి సిబ్బందిని సంప్రదించి, గాయపడినవారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
