ప్రజా ప్రభుత్వంలో నెరవేరుతున్న పేదవాడి సొంతింటి కల..
హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు..
జమ్మికుంటలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు అందజేసిన ప్రణవ్.
పదేళ్ల నిరీక్షణ తర్వాత ఇందిరమ్మ ఇళ్ల నిర్మానానికి పట్టాలు.

జమ్మికుంట, జూన్ 1 (zindagi9news): పదేళ్ల నిరీక్షణ తర్వాత, పేదలకు సొంతింటి కల నెరవేర్చినందుకు లబ్ధిదారులు ఉత్సాహంగా స్పందించారు. జమ్మికుంట పట్టణంలో, ఆదివారం రోజున, కాంగ్రెస్ పార్టీ నాయకుడు వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రణవ్ మరియు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కొబ్బరికాయ కొట్టి, 24, 19, 1, 2 వార్డులలో లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు.
ఈ సందర్భంగా, ప్రణవ్ మాట్లాడుతూ, “పదేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గంలో ఒక్క ఇంటిని కూడా ఇవ్వలేదని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లే సాక్ష్యంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవారి సొంతింటి కల నెరవేరుతుందని హర్షం వ్యక్తం చేశారు.
“కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత, ప్రతి అర్హుడికి పథకాలు అందజేస్తాం. రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్, సన్న బియ్యం, ఉచిత బస్ రవాణా వంటి సంక్షేమ పథకాలు ప్రజాదరణ పొందుతున్నాయి” అని ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ, మండల, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
