
జమ్మికుంట, మే 31 (Zindagi9News):
జమ్మికుంట ప్రాంతానికి చెందిన ఓ యువకుడు తన తల్లి వద్ద డబ్బుల కోసం గొడవపడి, హింసించాడన్న ఆరోపణలపై అరెస్ట్ అయ్యాడు.
పోలీసుల ప్రకారం, 19 ఏళ్ల వ్యక్తి తాను చదువును మానేసి ఇంట్లోనే ఉండి, తల్లి వద్ద డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని, ఇవ్వకపోతే హింసకు పాల్పడుతున్నాడని సమాచారం. మే 30న తల్లి తలపై రాడుతో కొట్టి గాయపరిచినట్లు ఫిర్యాదు వచ్చినట్టు పోలీసులు తెలిపారు.
ఈ నేపథ్యంలో నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
