
పెబ్బేరు మండల పరిధిలోని తోమాలపల్లి గ్రామంలో భూసంబంధిత సమస్యల పరిష్కారానికి రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించబడింది. ఈ సందర్భంగా అధికారులు గ్రామ రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
భూభారతి కొత్త చట్టం ప్రకారం భూముల రిజిస్ట్రేషన్, సమస్యల పరిష్కారం తదితర అంశాలపై రైతులకు స్పష్టమైన అవగాహన కలిగేలా వివరించారు.
ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాఘవేంద్రరావు, సూపరింటెండెంట్ నందకిషోర్, జూనియర్ అసిస్టెంట్ వంశీ, మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి విరేష్ కుమార్, గ్రామ అధ్యక్షులు గుడిసె శ్రీనివాసులు, కె. రాముడు, మొగులన్న (చంటి), మాజీ సింగిల్ విండో వైస్ చైర్మన్ మహదేవుడు, యూత్ అధ్యక్షుడు శివకుమార్, ఉమేష్ గౌడ్ తదితర గ్రామ ప్రజలు, యువకులు, రైతులు పాల్గొన్నారు.
ఈ అవగాహనా సదస్సు రైతులకు ఎంతో ఉపయోగకరంగా నిలిచింది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
