
జమ్మికుంటలో పారిశుధ్య పనులపై చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ ఆకస్మిక పరిశీలన
జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్న సమయంలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ఆకస్మికంగా పరిశీలించారు. ప్రధాన రహదారులపై శుభ్రత పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కార్మికులకు సూచించారు.
మెయిన్ రోడ్డుపై ఎక్కువగా వాహనాల రాకపోకలు ఉండటంతో, పనులు నిర్వహించే సమయంలో వాహనదారులను గమనిస్తూ జాగ్రత్తగా పనిచేయాలని చైర్మన్ సూచించారు. కార్మికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు తెలిపారు.
ఇటీవల ఫ్లైఓవర్ బ్రిడ్జిపై జరిగిన బస్ ప్రమాద స్థలాన్ని కూడా చైర్మన్ పరిశీలించారు. ఆ ప్రాంతంలో భద్రతా చర్యలు మరింత బలోపేతం చేయాలని, ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.పట్టణ శుభ్రత, ప్రజల భద్రత విషయంలో మున్సిపాలిటీ కట్టుబడి పనిచేస్తుందని చైర్మన్ తెలిపారు.

