
జమ్మికుంటలో రూ.20 లక్షలతో ప్రజా మరుగుదొడ్ల నిర్మాణానికి భూమిపూజ
జమ్మికుంట పాత మున్సిపల్ కార్యాలయ సమీపంలో పారిశుధ్య కార్మికులు, పట్టణ ప్రజలకు ఉపయోగపడే విధంగా రూ.20 లక్షల వ్యయంతో ప్రజా మరుగుదొడ్ల నిర్మాణానికి సోమవారం భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) హాజరై శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, పట్టణ పరిశుభ్రతలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుధ్య కార్మికులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం మున్సిపాలిటీ బాధ్యత అని తెలిపారు. ప్రజలకు సౌకర్యవంతమైన మరుగుదొడ్లు అందుబాటులోకి రావడంతో స్వచ్ఛత మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ మాచెర్ల రాజుతో పాటు శ్రావణ్ కుమార్, రాము, చిన్నాల శ్రీకాంత్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. పట్టణ అభివృద్ధి కార్యక్రమాలను దశలవారీగా చేపడతామని అధికారులు తెలిపారు.
