మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులకు గత 16 రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం చేసిన ఒప్పందాలను అమలు చేయాలి
ఎ పి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ( సి ఐ టి యు ) డిమాండ్
మున్సిపాలిటీ లో పనిచేస్తున్న పారిశుద్ధ్య,ఇంజనీరింగ్ అండ్ స్ట్రీట్ లైటింగ్ కార్మికులకు గత 16 రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం చేసిన ఒప్పందాలను అమలు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి టి.శివరాం,పట్టణ,మండల అధ్యక్షులు పి.రామాంజనేయులు, నక్కీశ్రీకాంత్, కోశాధికారి బి.నాగమద్దయ్య,మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష,కార్యదర్శులు కె.పెద్దఎల్లయ్య,ఎ.కుల్లాయప్ప డిమాండు చేశారు.రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించారు.ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ కి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ సమ్మె కాలం ఒప్పందాలతో పాటు డోన్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న స్థానిక సమస్యలపై పదే పదే నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ అధికారుల దృష్టికి తెస్తున్నా సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని మీరు చేసే వినతులను పైకి పంపుతున్నాము అక్కడి నుండి అనుమతులు రాలేదంటూ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని వెంటపడి సమస్యలు పరిష్కరించడంలో విఫలం అవుతున్నారని ఇది సరికాదని ఇప్పటికైనా అధికారుల తీరు మారాలని పనులు చేపించుకోవడంపై ఉన్న శ్రద్ధ కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల కూడా చూపాలని లేని యెడల ఉద్యమాలను ఉద్రుతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏసు,చేపల రామాంజి,ఓబులేసు,వెంకటలక్ష్మి,రంగనాయకులమ్మ తదితరులు పాల్గొన్నారు.
డిమాండ్స్ :-
1) మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం పొందిన 7 మంది మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు రూ.2,00,000 లక్షల ఎక్స్గ్రేషియా వెంటనే చెల్లించాలి.
2) మరణించిన మరియు రిటైర్మెంట్ అయిన కార్మికుల కుటుంబ సభ్యులను ఉద్యోగాలలోకి తీసుకోవడానికి ఆప్కాస్ ఆమోదం కొరకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి.
3) పిఎఫ్,ఈఎస్ఐ సమస్యలను వెంటనే పరిష్కరించాలి
4) సంక్రాంతి కానుక రూ.1000 రూపాయలు వెంటనే ఇవ్వాలి
5) పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్ లో ఉన్న ఒక నెల హెల్త్ అలవెన్స్ వెంటనే ఇవ్వాలి
6) పర్మినెంట్ మరియు ఆప్కాస్ కార్మికులకు బట్టలు,చెప్పులు,సబ్బులు,నూనెలు,రక్షణ పరికరాలు,పనిముట్లు వెంటనే ఇవ్వాలి
7) వాహనాల రిపేర్ల ఖర్చు డ్రైవర్ల పై మోపకుండా మున్సిపాలిటీ నుండే చెల్లించాలి,అర్హతలు కలిగిన డ్రైవర్లకు రూ.24,500 రూపాయల వేతనాలు ఇవ్వాలి
8) మున్సిపల్ ఇంజనీరింగ్,కాంట్రాక్టు/ అవుట్ సోర్సింగ్ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలి
9) ఇంజనీరింగ్ కార్మికులకు కూడా జి.ఓ.యం.ఎస్.నెం.36 ప్రకారం పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చే విధంగా రూ.21,000/-ల ప్రకారం వేతనాలు ఇవ్వాలి.
10) రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలి.

