బోయినిపల్లి, ఫిబ్రవరి 21 :రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో ఉమ్మడి నిజామాబాద్ -మెదక్ -ఆదిలాబాద్ – కరీంనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వుట్కూరి నరేందర్ రెడ్డి గెలుపు కొరకు మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి, వారికి దిశ – నిర్దేశం చేసిన చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం.
ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఒక సంవత్సర కాలంలో 55 వేల ఉద్యోగాల భర్తీ చేసిందని,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డి గెలుపు కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కష్ట పడి పని చేయాలని అన్నారు.బోయినిపల్లి మండలంలో అధిక ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి వేపించి మెజారిటీ తీసుకురావాలని,కష్టపడి పనిచేసిన ప్రతి కాంగ్రెస్ సైనికుని రాబోయే స్థానిక ఎన్నికల్లో గుర్తింపు లభిస్తుందన్నారు.ప్రభుత్వానికి, నిరుద్యోగులకు వారధిగా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఉంటారని పేర్కొన్నారు.
