తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ కోసం నిరంతర పోరాటం చేస్తున్న మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ కు సన్మానార్థం పాలాభిషేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మార్చి 19, 2025 (బుధవారం) సాయంత్రం 5 గంటలకు దండోరా జండా దగ్గర ఎస్సీ కమ్యూనిటీ హాల్ వద్ద జరగనుంది.
మందకృష్ణ మాదిగ పోరాట ప్రస్థానం
30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం అహర్నిశలు కృషి చేస్తూ, అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించి SC ABCD వర్గీకరణ సాధించడంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా, చిన్నపిల్లల గుండె ఆపరేషన్ల కోసం, వికలాంగుల, వృద్ధుల, వితంతువుల సంక్షేమం కోసం అనేక పోరాటాలు నిర్వహించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్వయంగా ఆరోగ్యశ్రీ పథకం స్థాపన వెనుక మందకృష్ణ మాదిగ కృషిని అసెంబ్లీలో గుర్తించారు.
మాదిగ సామాజికవేత్తల హాజరుకు విజ్ఞప్తి
ఈ పాలాభిషేక కార్యక్రమానికి మాదిగ సంఘ నాయకులు, సామాజికవేత్తలు, కుల సంఘాల ప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలని దండోరా కమిటీ కొప్పునూరు గ్రామ అధ్యక్షుడు తగరంనాగరాజు కోరారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
