హనుమకొండ జిల్లా, మార్చి 18 (Zindagi9 News ప్రతినిధి):
నగరంలోని ఓ మైనర్ బాలికను అపహరించి, అత్యాచారం చేసిన అనంతరం వ్యభిచారం చేయించేందుకు యత్నించిన ఆరుగురు సభ్యుల ముఠాను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. మిల్స్ కాలనీ పోలీసులు మంగళవారం ఒక మైనర్ బాలికతో సహా ఒక మహిళ, నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల స్వాధీనం
నిందితుల వద్ద నుండి 1.8 కిలోల గంజాయి, ఓ కారు, ₹75,000 నగదు, నాలుగు సెల్ఫోన్లు, ప్రధాన నిందితురాలి ఇంటి వద్ద భారీగా కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టు అయిన నిందితులు:
1. ముస్కులత (ల్యాదేళ్ల గ్రామం, దామెర మండలం, వరంగల్)
2. మైనర్ బాలిక
3. అబ్దుల్ అఫ్నాన్ (వరంగల్, శంభుని పేట)
4. షేక్ సైలాని బాబా
5. మహ్మద్ అల్తాఫ్
6. మీర్జా ఫైజ్ బేగ్ (అలియాస్ వదూద్)
పోలీసుల వివరాలు
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ప్రకారం, మార్చి 11న మైనర్ బాలిక కనిపించకుండా పోయిందని వచ్చిన ఫిర్యాదుతో మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ములుగు క్రాస్ రోడ్డు వద్ద బాలికను గుర్తించి పోలీసుల సంరక్షణలోకి తీసుకుని విచారణ జరిపారు.
బాలిక వెల్లడించిన వివరాల ప్రకారం, ఆరుగురు నిందితులు ఆమెను అపహరించి గంజాయి తాగించి అత్యాచారానికి పాల్పడి, అనంతరం వ్యభిచారం చేయించేందుకు యత్నించినట్లు తెలిసింది.
నిందితుల చట్టవ్యతిరేక కార్యకలాపాలు
🔸ప్రధాన నిందితురాలు ముస్కులత ల్యాదేళ్ల గ్రామంలో వ్యభిచార గృహాన్ని నడుపుతోంది.
🔸మరొక మైనర్ నిందితురాలను ఆశ్రయం ఇచ్చి, వ్యభిచారం చేసేందుకు ఒప్పించింది.
🔸బాధిత బాలికతో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచి, నమ్మకం కలిగించారు.
🔸శాపింగ్ మాల్స్‌లో బట్టలు కొనిపించి, మద్యం, గంజాయి అలవాటు పర్చారు.
🔸మార్చి 11న కారులో తీసుకెళ్లి, గంజాయి తాగించి అత్యాచారానికి పాల్పడ్డారు.
🔸అత్యాచార దృశ్యాలు వీడియో తీయామని బెదిరించి, వ్యభిచారానికి దారి తీసే ప్రయత్నం చేశారు.
పోలీసుల చర్యలు
వరంగల్ సెంట్రల్ డిసిపి షేక్ సలీమా పర్యవేక్షణలో, మూడు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకున్నారు. ఈ కేసును పరిశీలించిన పోలీస్ కమిషనర్ సెంట్రల్ జోన్ డిసిపి షేక్ సలీమా, ఏసిపి నందిరాం నాయక్, మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ వెంకటరత్నం, ఎస్.ఐలు శ్రీకాంత్, సురేష్ లను అభినందించారు.
హెచ్చరిక
🔹పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు:
🔹మైనర్ బాలికలు, యువతులు అపరిచితుల మాటలను నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలి.
🔹ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ద్వారా పరిచయాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.
🔹అనుమానాస్పద వ్యక్తులపై తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలి.
