మే 3 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం | మొత్తం 4.67 లక్షల సీట్లు | క్లాసులు జూన్ 30 నుంచి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పూర్తిచేసిన విద్యార్థుల కోసం డిగ్రీ కోర్సులలో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ద్వారా ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైంది. 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి మే 2న అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయబడింది.
ప్రధాన తేదీలు ఇలా ఉన్నాయి:
🔹ప్రథమ దశ రిజిస్ట్రేషన్: మే 3 నుంచి మే 21 వరకు
🔹వెబ్ ఆప్షన్లు ఎంపిక: మే 10 నుంచి మే 22 వరకు
🔹సీట్ల కేటాయింపు – మొదటి జాబితా: మే 29
🔹ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్: మే 30 నుంచి జూన్ 6 వరకు
🔹క్లాసుల ప్రారంభం: జూన్ 30
ఈ సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా 987 కళాశాలలు దోస్త్ ప్రక్రియలో పాల్గొంటున్నాయి. మొత్తం 4,67,456 సీట్లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు https://dost.cgg.gov.in వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజుగా ₹200 చెల్లించాల్సి ఉంటుంది.
ప్రత్యేక కేటగిరీల ధ్రువీకరణ తేదీలు:
🔸PH / CAP అభ్యర్థులు: మే 21
🔸NCC / క్రీడలు / ఇతర కార్యకలాపాలు: మే 22
ప్రభుత్వం ప్రవేశపెట్టిన “బకెట్ సిస్టమ్” ద్వారా కళాశాలల ఎంపిక సులభతరం కానుంది. అభ్యర్థులు అవసరమైన డాక్యుమెంట్లతో కూడిన దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి.
