సిద్ధిపేట: ఫిర్యాదుదారునిపై కేసు నమోదు కాకుండా చూసేందుకు మరియు ప్రమాదానికి గురైన వాహనాన్ని విడిపించేందుకు అధికారికంగా సహకారం చూపించడమే కాకుండా, ఇందుకు రూ.10,000 లంచం తీసుకుంటూ మిడిదొడ్డి రక్షక భట నిలయంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ ఎరికోటి సంతోష్ కుమార్ ACB అధికారులకు దొరికాడు.
ఆరోపణల మేరకు, బాధితుడి వద్దకు వచ్చిన హోంగార్డ్ సంతోష్ కుమార్, “మీపై కేసు పెట్టకుండా, వాహనాన్ని విడుదల చేయాలని చూస్తే, దానికి కొంత ఖర్చు అవుతుంది” అంటూ లంచం డిమాండ్ చేశాడని తెలుస్తోంది. దీన్ని నిర్థారించుకున్న ఏసిబి అధికారులు, నిఘా పెట్టి, హోంగార్డ్ చేతికి డబ్బులు అందుకుంటున్న సమయంలో అరెస్ట్ చేశారు.
ఇప్పటికే ఈ ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది. అవినీతి నిరోధక చట్టాల కింద కేసు నమోదు చేసి, ఆధారాలను సేకరిస్తున్నట్టు ఏసిబి అధికారులు తెలిపారు.
