
తిరుపతి జిల్లాలో షాకింగ్ ఘటన – సొంత కూతురి అల్లుడితో తల్లి వివాహానికి ప్రయత్నం
తిరుపతి జిల్లా కేవీబీ పురంలో జరిగిన ఈ సంఘటన స్థానికులను షాక్కు గురి చేసింది. సమాచారం ప్రకారం, ఐదు నెలల క్రితం ఓ యువతి ప్రేమవివాహం చేసుకుంది. అయితే గత కొన్ని రోజులుగా ఆమె అత్తగా మారిన తల్లి తన అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలిసింది.
ఈ విషయాన్ని గమనించిన కూతురు తల్లిని నిలదీయగా, పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. ఆగ్రహానికి లోనైన తల్లి, కూతురిపై రోకలి బండతో దాడి చేసింది. కూతురు కేకలు వేయడంతో అక్కడికువచ్చిన స్థానికులు ఆమెను కాపాడారు.
సొంత కూతురి అల్లుడితో వివాహం చేసుకోవాలనే తల్లి నిర్ణయం గ్రామంలో కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
