
తోట మాణిక్యమ్మకు నివాళులర్పించిన మంత్రి తుమ్మల
జిందగీ నైన్ న్యూస్, అక్టోబర్ 05(వైరా నియోజకవర్గ రిపోర్టర్: రామునాయక్) : ఏన్కూర్ మండల పరిధిలోని నాచారం గ్రామానికి చెందిన తోట మాణిక్యమ్మ ఇటీవల మృతి చెందడం జరిగింది. ఆదివారం మాణిక్యం దిశ దిన కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు మాణిక్యమ్మ చిత్రపటానికి పూలమాలవేసి మంత్రి తుమ్మల నివాళులర్పించారు. మాణిక్యమ్మ భర్త, తోట వెంకటేశ్వరరావు గతంలో మృతి చెందడం జరిగింది దివంగత తోట వెంకటేశ్వరరావు కుటుంబంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు మంచి సంబంధాలు ఉన్నాయి. తోట వెంకటేశ్వరరావు, మాణిక్యమ్మ దంపతులు ఇద్దరు మృతి చెందటం తనను ఎంతో కలిచివేసిందని మంత్రి తుమ్మల అన్నారు. అనంతరం మాణిక్యమ్మ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, గుత్తా వెంకటేశ్వరరావు, మేడ ధర్మారావు, శోభన్ నాయక్, తదితరులు ఉన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
