
తప్పిన భారీ రైలు ప్రమాదం.. జమ్మికుంట సమీపంలో ఇస్పాత్ ఎక్స్ప్రెస్ నిలిచివేత
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లి శివారులో భారీ రైలు ప్రమాదం తృటిలో తప్పింది. నెంబర్ 22737 ఇస్పాత్ ఎక్స్ప్రెస్ రైలు ఇంజిన్ వీల్ విరిగిపోవడంతో రైలు ఒక్కసారిగా నిలిచిపోయింది. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో జరిగిన ఈ ఘటనతో రైలు పట్టాలపైనే నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉప్పల్ రైల్వే స్టేషన్ సమీపంలోని మడిపల్లి గేట్ వద్ద సుమారు నాలుగు గంటల పాటు రైలు నిలిచింది. అనంతరం రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టి, వేరే ఇంజిన్ను ఏర్పాటు చేసి రైలును ఉప్పల్ రైల్వే స్టేషన్కు తరలించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
