రూ.35 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ ఏఈ

సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు మెరుపు దాడి నిర్వహించారు. రిటైర్డ్ ఉద్యోగి పెన్షన్ దరఖాస్తు ప్రాసెస్ చేయడానికి రూ.40 వేల లంచం డిమాండ్ చేసిన ఏఈ సూర్యవంశీ సంతోష్‌పై బాధితుడు ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు ట్రాప్ నిర్వహించారు. రూ.35 వేల నగదు తీసుకుంటుండగా అధికారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
