డిగ్రీ కళాశాల సందర్శించిన కాంగ్రెస్ నాయకులు

పెబ్బేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ వెంకట ప్రసాద్ ఆహ్వానంపై, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎద్దుల విజయ్ వర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కళాశాలను సందర్శించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ— కళాశాలకు సొంత పరీక్షా కేంద్రం లేకపోవడం వల్ల విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లి పరీక్షలు రాయాల్సి వచ్చేది. ఈ సమస్యను ఎద్దుల విజయ్ వర్ధన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి, స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ద్వారా పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తో చర్చలు జరిపించి కళాశాలకు సొంత పరీక్షా కేంద్రం మంజూరు అయ్యేలా కృషి చేశారని తెలిపారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులకు తేనీటి విందు ఇచ్చి, శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కారుపాకుల వెంకట రాములు, సీనియర్ నాయకుడు దయాకర్ రెడ్డి, 8వ వార్డు ఇంచార్జి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు జంగీర్, యువ నాయకుడు కురుమూర్తి ముదిరాజ్, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.
