వికలాంగుల మండల అధ్యక్షునికి ఘన సన్మానం

టేకుమట్ల, ఆగస్ట్ 1: టేకుమట్ల మండల నూతన వికలాంగుల సంఘ అధ్యక్షుడు అమ్ముల కుమారస్వామిని జిల్లా కాంగ్రెస్ నాయకులు శుక్రవారం ఘనంగా సన్మానించారు. మాతృశ్రీ ఫౌండేషన్ చైర్మన్ దొంతుల శ్రీనివాస్ అతనిని శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, “వికలాంగుల అభివృద్ధికి నూతన అధ్యక్షుడు ప్రత్యేకంగా కృషి చేయాలని ఆశిస్తున్నాం” అని తెలిపారు.
అధ్యక్షుడు కుమారస్వామి మాట్లాడుతూ, “మండలంలోని అన్ని వికలాంగులకు ప్రభుత్వ పథకాలు అందేలా నిబద్ధతతో పనిచేస్తాను. నన్ను గౌరవించిన నాయకులకు ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వైనాల రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నాంపల్లి వీరేశం, మండల ప్రధాన కార్యదర్శి బండి రవీందర్, ఉపాధ్యక్షుడు మాదం కొమురయ్య, కోశాధికారి శాస్త్రాల కిరణ్, బోయిన మధుకర్, కుమార్, పోశాలు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
