హనుమకొండ:హస్తకళలను ప్రోత్సహించడం సమాజ బాధ్యతని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండలోని తార గార్డెన్స్ లో గురువారం ఏర్పాటు చేసిన “చేనేత హస్తకళ హ్యాండ్లూమ్ & హ్యాండిక్రాఫ్ట్ ప్రదర్శన మరియు అమ్మకం” స్టాళ్లను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా చేనేత కళాకారులను ప్రోత్సహించి, సంప్రదాయ హస్తకళలను ఆదరించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రదర్శనలో ఉంచిన ఉత్పత్తులు విశేషంగా ఆకట్టుకున్నాయని, ప్రతి ఒక్కరూ సందర్శించి కొనుగోలు చేయాలని ఆయన కోరారు.
అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని సన్మానించారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని లక్ష్మా రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు రాజమల్లా రెడ్డి, నాయకులు సింగారపు రవి ప్రసాద్, రఘుపాల్ రెడ్డి, పవన్ కుమార్ సహా చేనేత హస్తకళల నిర్వాహకులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
