హనుమకొండ, ఫిబ్రవరి 27(జిందగీ9న్యూస్):ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా (IPS) గురువారం ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటైన ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా పోలీస్ బందోబస్త్, మౌలిక వసతులు, ఎన్నికల ప్రక్రియ నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా కొనసాగుతున్నదేనా అనే విషయంపై పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సురక్షితమైన మరియు పారదర్శకమైన ఎన్నికల నిర్వహణ కోసం పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
