
వీణవంక, మే 27 (Zindagi9News):
కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని కొండపాక, పోతిరెడ్డిపల్లి వద్ద మానేరు నదిపై తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TGMDC) ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేసినప్పటికీ, అక్కడికి సరైన రహదారి లేకపోవడం విశేషం. సంబంధిత అధికారులు అవసరమైన ప్రాథమిక వసతులు లేకుండానే ఇసుక రీచ్‌ను ప్రారంభించడం వివాదాస్పదంగా మారింది.

ఇసుక రీచ్ ఉన్న ప్రదేశానికి లారీలు రాకపోకలు సాగించే వీలు లేకుండా ఉండటంతో, స్థానిక చెరువు కట్టల మీదుగా లారీల రాకపోకలు పెరిగాయి. ఈ కారణంగా చెరువు కట్టలు దెబ్బతిని, సాగునీటి వనరులకు ప్రమాదం తలెత్తే పరిస్థితి నెలకొంది.
రైతుల ఆవేదన – అధికారుల నిర్లక్ష్యం
ఇసుక రవాణా కోసం చెరువు కట్టలను వినియోగించడాన్ని తీవ్రంగా నిరసిస్తున్న గ్రామస్థులు, ముఖ్యంగా రైతులు, సంబంధిత ఇరిగేషన్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువు కట్టలను రక్షించే చర్యలు తీసుకోవాలి,” అని వారు కోరుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇసుక రీచ్ నిర్వహణలో ప్రణాళికా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇసుక రీచ్ ఏర్పాటు చేసే ముందు సరైన రోడ్డు, స్టాక్ యార్డ్ వసతి వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
