
చెంచువాడ పాఠశాలకు టీచర్ల కొరతపై స్పందించిన ఎమ్మెల్యే మెగారెడ్డి
🔹 డిప్యూటేషన్‌పై ఇద్దరు టీచర్ల నియామకం
🔹 ఎమ్మెల్యే మెగారెడ్డి, ఎంఈఓ జయరామ్‌కు అభినందనలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు, పాఠశాల సిబ్బంది
🔹 త్వరలోనే అదనపు తరగతి గదులు ఏర్పాటు చేస్తామన్న ఎమ్మెల్యే
పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని చెంచువాడ మండల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగడంతో టీచర్ల కొరత ఏర్పడింది. గతంలో 40 మంది విద్యార్థులతో కొనసాగిన ఈ పాఠశాలలో ప్రస్తుతం 93 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అదనపు టీచర్ల అవసరం ఉందని పాఠశాల ఉపాధ్యాయుడు చిన్న రాములు వనపర్తి జిల్లా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అక్కి శ్రీనివాస్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే మెగారెడ్డి వెంటనే ఎంఈఓ జయరామ్‌కు తెలియజేయగా, శనివారం డిప్యూటేషన్‌పై ఇద్దరు టీచర్లను నియమించారు. అదనపు తరగతి గదుల ఏర్పాటుకు త్వరలో చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
శనివారం కాంగ్రెస్ నాయకులు పాఠశాలను సందర్శించి, తక్షణ చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే మెగారెడ్డి, ఎంఈఓ జయరామ్‌కు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ జయరామ్, స్కూల్ టీచర్ చిన్న రాములు, జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్కి శ్రీనివాసులు గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటసాగర్, మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్, మార్కెట్ డైరెక్టర్ మోతే రాములు, రామన్ గౌడ్, రణధీర్ రెడ్డి, డైరెక్టర్ రాములు, శివ సాయి, యువ నాయకుడు శివకుమార్, పట్టణ ఉపాధ్యక్షుడు రజాక్ నరసింహ, కటికల వినోదు, మిర్చి వెంకటేశు తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
