న్యూఢిల్లీ: వెయిటింగ్ లిస్ట్ టికెట్ కలిగిన ప్రయాణికులు ఇకపై జనరల్ బోగీల్లో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం, వెయిటింగ్ లిస్ట్ టికెట్ ఉన్న వారు AC లేదా స్లీపర్ బోగీల్లో ప్రయాణిస్తే జరిమానా విధించనున్నారు.
రైల్వే శాఖ ప్రకారం, వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులు AC బోగీలో ప్రయాణిస్తే టికెట్ ఛార్జీకి అదనంగా రూ.440 ఫైన్ చెల్లించాలి. స్లీపర్ బోగీలో ప్రయాణిస్తే రూ.250 ఫైన్‌తో పాటు టికెట్ ఛార్జీ వసూలు చేయనున్నారు.
రూల్స్ ఉల్లంఘించిన వారికి టిటిఈలు (TTE) కఠిన చర్యలు తీసుకోనున్నారు. రైల్వే శాఖ ఈ మార్పులను ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అమలు చేస్తోంది.
ప్రయాణికులు కొత్త నిబంధనలను గమనించి, జరిమానా పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రైల్వే శాఖ సూచించింది.
